సూపర్ స్టార్ రజినీకాంత్ వజ్రాలు(డైమండ్స్) దోపిడీ చేయనున్నాడా..? విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తుంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘లింగా’. ఈ సినిమాలో రజిని ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పాత్రలో రజిని కలెక్టర్ గా కనిపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే మరో పాత్రలో రజిని ఆహార్యం, పాత్ర చిత్రీకరణ వైవిధ్యంగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారట. ‘లింగా’ సినిమాలో రజినీకాంత్ పై చిత్రీకరిస్తున్న ఒక ఫైట్ సినిమాకి హైలైట్’గా నిలిస్తుందని అంటున్నారు. జ్యువలరీ ఎక్సిబిషన్ నుండి చాలా ఖరీదైన వజ్రాన్ని రజిని దోపిడీ చేయనున్నారట. 20 నిముషాల పాటు సాగే ఈ సన్నివేశం అభిమానులని ఉత్కంఠకు గురిచేస్తుందని సమాచారం. ఈ సన్నివేశం సహజంగా రావడం కోసం రజిని శ్రమిస్తున్నారు. ఈ వార్త అభిమానులలో ఆసక్తిని రేపుతుంది. ఇందులో ఎంత వరకు నిజం ఉందొ తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే. అనుష్క, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
------------------------------ ------------------------------ -----
No comments:
Post a Comment